గ్లాస్గో కామన్వెల్త్ లో హాకీ తొలగింపు!

హాకీ(Hockey) అభిమానులకు భారీ షాకింగ్ న్యూస్.

Update: 2024-10-21 15:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : హాకీ(Hockey) అభిమానులకు భారీ షాకింగ్ న్యూస్. 2026లో గ్లాస్గో(Glasgo)లో జరగనున్న కామన్వెల్త్(Commonwealth) గేమ్స్ లో హాకీని తొలగించనున్నారని పలు అంతర్జాతీయ, జాతీయ న్యూస్ చానెల్స్ లో వార్తలు వస్తున్నాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ అంతర్జాతీయ క్రీడలు వచ్చే ఏడాది జూలై-ఆగస్టులో స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరగనున్నాయి. త్వరలోనే ఈ క్రీడలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు. సాధారణంగా కామన్వెల్త్ క్రీడల్లో 19 ఈవెంట్స్ నిర్వహిస్తుండగా.. ఖర్చు తగ్గించుకోవడం కోసం ఈసారి 10 ఈవెంట్స్ మాత్రమే నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే హాకీ, నెట్ బాల్ తో పాటు మరో ఏడు ఈవెంట్స్ ను తొలగిస్తున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలిపాయి. ఒకవేళ ఈ వార్తలు నిజం అయితే భారత్ కు పెద్ద దెబ్బనే అనుకోవాలి. పలుమార్లు భారత్ కామన్వెల్త్ లో పథకాలు సాధించింది. మరోవైపు ఈ వార్తలపై హాకీ అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.   


Similar News