CWG 2026: కామన్వెల్త్ - 2026నుంచి ఆ గేమ్స్ అన్నీ ఔట్.. ఇంకేం ఆడాలి ?

2026లో గ్లాస్కో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల పోటీల నుంచి కీలక ఆటలను తొలగిస్తున్నట్లు కామన్వెల్త్ ఫెడరేషన్ వెల్లడించింది.

Update: 2024-10-22 07:43 GMT

దిశ, వెబ్ డెస్క్: కామన్ వెల్త్ గేమ్స్ (Commonwealth Games) ప్రతి నాలుగేళ్లకొకసారి జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలు. ఒలింపిక్స్ మాదిరిగానే ఇవి కూడా ఒక్కోసారి ఒక్కోదేశంలో వివిధ దేశాల్లోని క్రీడాకారుల మధ్య జరిగే ఆటల పోటీలు. 1930లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారు. అయితే 1930-1950 మధ్య కాలంలో వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ గా పిలిచేవారు. 1954-1966 మధ్య బ్రిటిష్ అంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ అని, 1970 -1974 మధ్య బ్రిటిషన్ కామన్వెల్త్ గేమ్స్ అని పిలిచారు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ గానే పిలుస్తున్నారు.

2026లో గ్లాస్గో వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్ పోటీల నుంచి కొన్ని ఆటలను తొలగిస్తూ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఒక ప్రకటన చేసింది. హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ గేమ్స్ ను ఈ పోటీల నుంచి తొలగించారు. ఖర్చు్లను తగ్గించుకునేందుకు ఈ క్రీడలను తొలగించినట్లు తెలుస్తోంది. 2022లో బర్మింగ్ హామ్ లో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ లో 19 క్రీడలు ఉండగా.. ఈసారి వాటిలోంచి 9 క్రీడలను తొలగించారు. 25వ కామన్వెల్త్ గేమ్స్ కు గ్లాస్కో (Glasgow) 12 ఏళ్ల తర్వాత ఆతిథ్యమివ్వనుంది. 2014లో ఇక్కడ కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.

అథ్లెటిక్స్- పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్-పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్- పారా ట్రాక్ సైక్లింగ్, నెట్ బాల్, వెయిట్ లిఫ్టింగ్ - పారా పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జుడో, బౌల్స్ - పారా బౌల్స్, 3*3 బాస్కెట్ బాల్ - 3*3 వీల్ చైర్ బాస్కెట్ బాల్ క్రీడలను నిర్వహించనున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వెల్లడించింది. కాగా.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఏకంగా 10 క్రీడలను తొలగించడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ ను తొలగించడంతో.. ఇంకెందుకు ఈ ఇంటర్నేషనల్ గేమ్స్ పోటీలు అని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.



Tags:    

Similar News