ICC Test Rankings : కగిసో రబాడా ఫస్ట్.. జస్ప్రిత్ బుమ్రా థర్డ్
ఐసీసీ తాజాగా మరోసారి టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. గతంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత పేసర్.. ఈసారి ఆ స్థానాన్ని దిగజార్చుకున్నాడు. బుమ్రా(Bumra) ఐసీసీ టెస్టు (ICC Test Rankings) ర్యాంకుల్లో ప్రస్తుతం రెండు స్థానాలను కోల్పోయి
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ తాజాగా మరోసారి టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. గతంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత పేసర్.. ఈసారి ఆ స్థానాన్ని దిగజార్చుకున్నాడు. బుమ్రా(Bumra) ఐసీసీ టెస్టు (ICC Test Rankings) ర్యాంకుల్లో ప్రస్తుతం రెండు స్థానాలను కోల్పోయి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రీసెంట్‌గా న్యూజిలాండ్(Newzeland)తో జరిగిన టెస్టు మ్యాచులో బుమ్రా పెద్దగా రాణించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచులో ఆ జట్టును చిత్తు చేసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ(kagiso rabada) అగ్రస్థానానికి చేరుకున్నాడు. రబాడా ఇటీవలే టెస్టుల్లో అత్యంత వేగంగా 300వ టెస్టు వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రబాడ (860) పాయింట్లతో ఫస్ట్ ర్యాంక్‌లో ఉండగా.. ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ (847) రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రా (846) పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత స్పిన్నర్ అశ్విన్ (831) కూడా రెండు ర్యాంకులను చేజార్చుకున్నాడు.
ఇక యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (790) పాయింట్లతో ఒక స్థానం మెరుగుపర్చుకుని 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (903), కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (813) తొలి 2 ర్యాంకుల్లో కొనసాగుతుండగా.. రిషభ్ పంత్ (708) పాయింట్లతో 5 స్థానాలను కోల్పోయి టాప్-10 నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక రోహిత్ శర్మ గత ఆరేళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఆరుస్థానాలు కోల్పోయి 15 స్థానం నుంచి 24వ స్థానానికి పడిపోయాడు. ఇక టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో భారత్ ఆటగాళ్లు టాప్‌లో కొనసాగుతున్నారు. అందులో రవీంద్ర జడేజా (434), రవిచంద్రన్ అశ్విన్ (315) ఉండగా.. మెహిదీ హసన్ (294), షకిబ్ అల్ హసన్ (280), జాసన్ హోల్డర్ (270) టాప్-5లో కొనసాగుతున్నారు.