AUS vs IND : మిచెల్ మార్ష్ ఔట్.. ఐదో టెస్టులో ఆసిస్ తరపున మరో ఆటగాడు అరంగేట్రం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరపున మరో క్రికెటర్ అరంగేట్రం చేయబోతున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరపున మరో క్రికెటర్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే మెక్‌స్వీనీ, సామ్ కొన్‌స్టాస్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ ఐదో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్నాడు. భారత్‌తో నేటి నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగే ఆసిస్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టులో ఆసిస్ మేనేజ్‌మెంట్ ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను ఐదో టెస్టుకు పక్కపెట్టింది. అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది. దేశవాళీలో వెబ్‌స్టర్ రాణిస్తున్నాడు. 93 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5,297 రన్స్ చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. అలాగే, 148 వికెట్లు కూడా పడగొట్టాడు.
ఆస్ట్రేలియా జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, లబుషేన్, స్టీవ్ స్మిత్, బ్యూ వెబ్‌స్టర్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, కమిన్స్, స్టార్క్, లియోన్, బోలాండ్