Ravi Shastri : రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి ‘కీ’ కామెంట్స్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ యువకుడేం కాదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

Update: 2025-01-02 11:26 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ యువకుడేం కాదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. గురువారం ఈ మేరకు ఆయన ఐసీసీ రివ్యూలో మాట్లాడారు. ‘రోహిత్ శర్మ నా దగ్గర ఉంటే బరిలోకి దిగి విధ్వంసం సృష్టించాలని సూచిస్తాను. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం కన్నా ప్రత్యర్థులపై అటాక్ చేయడంపై రోహిత్ ఫోకస్ చేయాలి. రిటైర్మెంట్‌పై రోహిత్ నిర్ణయం తీసుకుంటే ఆశ్చర్యపోను. ఎందుకంటే అతను యువకుడు కాదు. వరుసలో అనేక మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. గిల్ 2024లో 40 యావరేజ్‌తో అదరగొట్టాడు. అతను బెంచ్‌కు పరిమితం కావడం సరికాదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. రోహిత్ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. కానీ అతనికి గౌరవప్రదమైన వీడ్కోలు లభించాలి.’ అని శాస్త్రి అన్నాడు.

Tags:    

Similar News