FIFA friendly contest : మాల్దీవ్స్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్.. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు విజయం

బెంగళూరు వేదికగా గురువారం జరిగిన రెండో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.

Update: 2025-01-02 16:12 GMT

దిశ, స్పోర్ట్స్ : బెంగళూరు వేదికగా గురువారం జరిగిన రెండో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. మాల్దీవ్స్ టీంతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 11-1 తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన ఫార్వార్డ్ క్రీడాకారిణి లింగ్డేకిమ్ నాలుగు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన సిమ్రన్ గురుంగ్(62,68) నిమిషాల్లో భారత్ తరఫున రెండు గోల్స్ కొట్టింది. తొలి అర్థ భాగం ముగిసే సరికి భారత్ 6-1లీడ్‌లో నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌లో విజయం తర్వాత భారత హెడ్ కోచ్ జొకిమ్ అలెగ్జాండర్‌సన్ భారత జట్టులో భారీ మార్పులు చేశారు. దీంతో కేవలం కెప్టెన్ సంగీత, గోల్ కీపర్ మైబమ్ దేవి, డిఫెండర్ అరుణ మాత్రమే సెకండ్ మ్యాచ్‌లో చోటును పదిలం చేసుకున్నారు. లింగ్డేకిమ్(12, 16, 56, 59) నిమిషాల్లో గోల్స్ చేసింది. మాల్దీవ్స్ జట్టు మ్యాచ్ మొత్తంలో కేవలం ఒకే ఒక గోల్ చేసింది.  

Tags:    

Similar News