Shane Watson : కోహ్లీ, రోహిత్ పూర్ ఫామ్.. షేన్ వాట్సాన్ ఏమన్నాడంటే..?

కోహ్లీ, రోహిత్ ఛాంపియన్స్ ట్రోపీలో రాణిస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.

Update: 2025-01-02 15:38 GMT

దిశ, స్పోర్ట్స్ : కోహ్లీ, రోహిత్ ఛాంపియన్స్ ట్రోపీలో రాణిస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌లో భాగంగా ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడాడు. ‘కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్ ఫామ్ వన్డేల్లో ప్రభావం చూపదు. దుబాయ్‌లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. వన్డేల్లో ఇద్దరు స్వేచ్ఛగా ఆడతారు. కోహ్లీ అన్ని ఫార్మాట్‌లలో మాస్టర్. వన్డేల్లో అద్భుతంగా ఆడతాడు. కోహ్లీ 57 యావరేజ్, 93 స్ట్రయిక్ రేట్‌తో చాలా రోజుల నుంచి రాణిస్తున్నాడు. వన్డేల్లో పూర్తిగా అదుపులో ఉండి బరిలోకి దిగుతాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని అద్భుత ఆటను మరోసారి చూడబోతున్నాం. రోహిత్ ఆటతీరును 2023 వన్డే వరల్డ్ కప్‌లో చూశాం. ప్రత్యర్థి నుంచి వేగంగా మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా అతనికి ఉంది.’ అని వాట్సన్ అన్నాడు.

Tags:    

Similar News