IND VS AUS : కోహ్లీతో గొడవ.. స్పందించిన కాన్‌స్టాస్
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా బ్యాటర్ కాన్‌స్టాస్ వాగ్వాదం క్రికెట్‌లో చర్చనీయాంశమైంది.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా బ్యాటర్ కాన్‌స్టాస్ వాగ్వాదం క్రికెట్‌లో చర్చనీయాంశమైంది. రికీ పాంటింగ్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు విరాట్ తీరును తప్పుబట్టారు. తొలి రోజు అనంతరం ఆ ఘటనపై కాన్‌స్టాస్ స్పందించాడు. ఇలాంటి ఘటనలు క్రికెట్‌లో సాధారణమేనన్నాడు. ‘మేమిద్దం కాస్త భావోద్వేగానికి గురయ్యాం. కోహ్లీ వస్తున్నట్టు నేను గమనించలేదు. అప్పుడు నా గ్లవ్స్ సరిచేసుకుంటున్నా. అతను నన్ను అనుకోకుండానే ఢీకొట్టాడని అనుకుంటున్నా. క్రికెట్‌లో ఇలా జరగడం సాధారణమే. కేవలం టెన్షన్ మాత్రమే.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, అరంగేట్ర మ్యాచ్‌లోనే కాన్‌స్టాస్ సత్తాచాటాడు. 60 బంతుల్లో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు.