దసరా కల్లా ప్యాకేజ్-9 పనులు పూర్తి కావాలి

దిశ, కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్యాకేజీ-9 పనులను దసరా పండుగలోపు పూర్తి చేయాలని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం మల్కపేట రిజర్వాయర్, అండర్ టన్నెల్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మిషన్ మోడ్‌లో పనులు సత్వరం జరిగేలా చూడాలని, సొరంగం, లైనింగ్, పంప్ హౌజ్ నిర్మాణం పనులు ఆశించినంత వేగంగా సాగడం […]

Update: 2020-06-02 09:35 GMT

దిశ, కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్యాకేజీ-9 పనులను దసరా పండుగలోపు పూర్తి చేయాలని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం మల్కపేట రిజర్వాయర్, అండర్ టన్నెల్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మిషన్ మోడ్‌లో పనులు సత్వరం జరిగేలా చూడాలని, సొరంగం, లైనింగ్, పంప్ హౌజ్ నిర్మాణం పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదని ఇరిగేషన్ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇకనుంచైనా పనుల్లో వేగం పెంచాలన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అద్వితీయమైన విజయాలను సాధించిందని వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రం సాధించుకున్న ఆరేళ్ల కాలంలోనే అనేక రంగాల్లో ఘన విజయాలు సాధించి, దేశ యవనికపై చెరగని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా సాగునీటి రంగం, విద్యుత్, పంట దిగుబడులు, రైతులు, బడుగు బలహీనర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ముందు వరసలో నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News