అనుముల రేవంత్‌లో అ‘పరిపక్వత’!

దిశ, న్యూస్‌బ్యూరో: ‘ఏదైనా మన మంచికే..’ వేదాంతం రాజకీయాల్లో అనుముల రేవంత్‌రెడ్డికి బాగానే ఫిట్టవుతోందా? అంటే యస్.. రైటనే అంటున్నాయి స్టేట్ పాలిటిక్స్ పరిణామాలు! తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజుకున్న రోజుల్లో రేవంత్ టీడీపీలో ఉన్నారు. తన ఉడుకు రక్తం ఉరుకులాటతో, కారులో రైఫిల్ వేసుకొని తిరిగారు. సిద్దిపేట తదితర చోట్ల ఆ వెపెన్ చూపిస్తూ, స్టేట్ కోసం ఫైట్‌ అంబాసిడర్ అయిన టీఆర్ఎస్ కేడరుకు వార్నింగ్ ఇచ్చారు. ఆ విధంగా ‘తుపాకీ గురి మనోళ్ల మీదనేనా?’ […]

Update: 2020-03-09 06:14 GMT

దిశ, న్యూస్‌బ్యూరో:

‘ఏదైనా మన మంచికే..’ వేదాంతం రాజకీయాల్లో అనుముల రేవంత్‌రెడ్డికి బాగానే ఫిట్టవుతోందా? అంటే యస్.. రైటనే అంటున్నాయి స్టేట్ పాలిటిక్స్ పరిణామాలు! తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజుకున్న రోజుల్లో రేవంత్ టీడీపీలో ఉన్నారు. తన ఉడుకు రక్తం ఉరుకులాటతో, కారులో రైఫిల్ వేసుకొని తిరిగారు. సిద్దిపేట తదితర చోట్ల ఆ వెపెన్ చూపిస్తూ, స్టేట్ కోసం ఫైట్‌ అంబాసిడర్ అయిన టీఆర్ఎస్ కేడరుకు వార్నింగ్ ఇచ్చారు. ఆ విధంగా ‘తుపాకీ గురి మనోళ్ల మీదనేనా?’ అంటూ తటస్థులైన తెలంగాణీయులూ నొచ్చుకునేలా ప్రవర్తించారు. సీన్ కట్ చేస్తే, తెలిసీ తెలియక తప్పు చేస్తూ పిల్లవాడు పట్టుబడ్డట్టుగా ఓటుకు నోటు కేసులో ఈజీగా దొరికిపోయారు. ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌‌కు తేలిగ్గా చిక్కారు. స్టీఫెన్‌సన్‌తో ఆయన‌లోని అల్ప సంతోషపు డొల్ల సంభాషణల వీడియో రికార్డులూ పోటెత్తాయి. లేటెస్టుగా డ్రోన్ ప్రయోగం వివాదంలో ఇరుక్కున్నారు. యాజ్ పర్ లా ఈ మూడూ తప్పే! ఆయనలోని అ‘పరిక్వత’కు తార్కాణమంటే అవుననే వారూ, అపోజ్ చేసే వారూ కంపల్సరీ ఉంటారు!
అటు వైపేమో, రేవంత్ గురించి పట్టించుకునే అక్కెరే లేదనీ అధికార పక్షం చెబుతుంటుంది. లైట్ తీసుకుంటున్నట్టు స్వయానా సీఎం కేసీఆర్, యువ నేత కేటీఆర్ ఆయా సందర్భాల్లో సూటిగా చెప్పారు కూడా. కానీ, ఆచరణలో మాత్రం ప్రభుత్వ పెద్దల స్థాయిలోనే పరోక్షంగా ఫోకస్ పెడుతున్నారు. రేవంత్‌కు కౌంటర్ స్పెషలిస్టుగా బాల్క సుమన్‌ను దించుతున్నారు. 2018 ఎన్నికల్లో కంకణం కట్టుకొని మరీ కొడంగల్‌లో రేవంత్‌ను ఓడగొట్టారు. తీరా ఏమైందీ? ఏకంగా దేశంలోనే పెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజిగిరి నుంచి ఆయన విజేతయ్యారు. అక్కడ తనను ఓడించిన టీఆర్ఎస్‌నే, అంతకుముందు తనకు ఏ సంబంధమూ లేని మల్కాజిగిరిలో బీరిపోయిలా నోరెళ్లబెట్టించారు. డబ్బు వంటి చర, స్థిరాస్తుల బేరం లేకుండా ఏ నేతైనా, మరే ప్రధాన పార్టీ అయినా ఎట్లాంటి ఎన్నికలనైనా ఫేస్ చేస్తున్నదా? రేవంత్‌ను మాత్రం సర్‘కారు’ సారథులే అంబుష్ చేయించారు. నాటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అరకోటి ఇస్తుండగా 2015 మే 31న చట్టానికి చిక్కించారు.

ఇపుడివన్నీ ఎందుకంటే..!

సరిగ్గా పార్లమెంటు సమావేశాల్లో ఉండాల్సిన రేవంత్ జైలులో ఉన్నారు. ఇది కాస్తా స్టేటంతా స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా యూత్‌లో సింపతి గ్రాఫ్ అమాంతం పెరుగుతున్నది. సోషల్ మీడియా మొదలు, మౌత్ టు మౌత్ డిస్కస్ చేస్తున్నారు. బుడ్డ సారు బడా బంగళా గురించి బయటపెట్టినందుకే ప్రభుత్వం జైల్లో వేయించిందనే అవగాహనకు వస్తున్నారు. పాలక పార్టీ బాసుతోనే తనకు ప్రాణహాని ఉందంటూ, రక్షణ కోసం కోర్టును ఆశ్రయించడాన్ని గమనంలో ఉంచుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఆయన సోదరుడుకి తృటిలో టక్కర్ గండం తప్పడాన్ని ఉటంకిస్తున్నారు. ఐదేండ్ల కిందట ఏసీబీ వలలో పడ్డాక, రేవంత్ నెగెటీవ్‌గా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వమే కక్ష గట్టిందనే భావనను కొడంగల్ ఓటమి ఆథరైజ్ చేసింది. మల్కాజిగిరిలో విజయాన్ని కట్టబెట్టింది. ఏదో సామెతలా, తంతే పరుపులో పడ్డట్టు జెడ్పీటీసీతో మొదలైన రేవంత్ ప్రజాజీవితం పార్లమెంటు మెంబరుగా హోదా పెంచేసింది. ఆ రెంటికీ మధ్యలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా చేసిన అనుభవము ఉండనే ఉన్నది.

వ్యూహాల్లో వ్యూహమెంత?

రేవంత్‌ పట్ల చట్టాన్ని కఠినంగా పని చేయించడంలో సక్సెస్ అవుతున్నట్టు గులాబీయులు తెగ ముురిసిపోతున్నారు. కానీ, గ్రౌండ్ లెవెల్‌ ఇంపాక్ట్ ఏమిటో గ్రహిస్తున్నారా? అనేది డౌటు. ఈ సందేహం వాళ్లకూ కలిగినట్టుంది. అందుకే, రేవంత్‌ తనంతట తానే పోలీసులకు లొంగిపోయారనీ ఓ సెక్షన్ మీడియా ద్వారా కారు పార్టీ దండోరా వేయిస్తున్నది. తన బ్రదర్‌తో కలిసి సిటీ శివారులోని గోపన్‌పల్లిలో చేసిన ఏడెకరాల భూ కబ్జా యవ్వారం నుంచి దృష్టి మరల్చడానికే అరెస్టు, జైలు వ్యూహం పన్నారని అలర్ట్ చేస్తున్నది. కానీ, అప్పటికే జనంలోకి రేవంత్ అనుకూల పబ్లిసిటీ వేగంగా చేరింది. తమ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిచారంటూ రాష్ట్రంలో పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు ప్రొటెస్టు చేశాయి. కేటీఆర్ సెగ్మెంట్‌లోని గంభీరావుపేటలో కేసీఆర్ దిష్టిబొమ్మకు, ముస్తాబాద్‌లో కేటీఆర్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టాయి. ఎవరి వ్యూహాల్లో అసలు వ్యూహమెంతో కానీ, ప్రజల్లోకి మాత్రం రేవంత్‌పట్ల పాజిటీవ్ ఇంప్రెషనే ఇంజెక్ట్ అవుతున్నదనే వారు లేకపోలేదు! ప్రభుత్వం ఎంత అణచివేస్తే, అంత పాపులారిటీ విస్తరిస్తున్నదనే యాంగిల్‌ను ప్రస్తావించేవాళ్లు ఉన్నారు. కేసీఆర్‌ను సమైక్య పాలకులు నాడు ఎంతో స్ట్రగుల్ చేశారు. నిర్బంధాలు, అణిచివేతలతో సతాయించారు. ‘బూట్ల చప్పుడుకు గుండె ఆగాలే..’ లాంటి కరడుగట్టిన డైలాగూలు ఉమ్మడి పాలనలో సౌండిచ్చాయి. కేసీఆర్ ఐండ్ టీఆర్ఎస్ తెలంగాణ కోసం, తమ కోసమే పోరాడుతున్నారనే సోయితో జనం అక్కున చేర్చుకొని రెండోసారీ అధికారమిచ్చారు. నాడు జైలు జీవితం గడిపి, కడపటి ఎన్నికల్లో.. ‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అని ప్లజెంటుగా అప్పీలు చేసుకున్న జగన్ను ఏపీ తన గుండెల్లో పెట్టుకున్నది. అలవోకగా సీఎం పీఠాన్నే ఇచ్చింది. పోలీసు తిట్లు, కొట్లు, కేసులు, అరెస్టులు, జైలు వంటి వాటితోనే లీడర్లుగా ఫేమస్ అయినోళ్లలో అలాంటి ప్రముఖులెందరో! రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి కొందరికి మినహాయింపు ఉండొచ్చు!

తొడపాశం పెడుతున్నది తానేనా!

తెలంగాణ సమస్తమూ గులాబీ గుప్పిట్లోనే ఉన్నది. పాలకులను దృఢంగా ఎదుర్కొనే సాహసికుల్లో రేవంత్ మొదటి వారని కాలరు ఎగరేసే వాళ్లెందరో! రాష్ట్రంలోని పార్టీలూ, నేతల్లో అనేకులకూ ‘ఏవేవో బంధాలు’ బంధనాలు కావడం లేదంటే, నమ్మేంతటి అమాయకులం కాదనే సెక్షనూ ఉన్నది. సంగారెడ్డి జగ్గన్న గట్టిగానే నిలబడుతున్నా.. అపుడపుడు డిఫరెంటు స్టేట్‌మెంట్లతో తికమక పెడుతున్నారనే ముద్ర పడుతున్నది. నిజానికి రేవంత్‌రెడ్డి 2017లో చేరేదాకా కాంగ్రెస్‌కు మాత్రమే కొత్త. స్టూడెంటు లీడరుగా బీజేపీ అనుబంధ ఏబీవీపీసహా టీడీపీ, టీఆర్ఎస్‌లలో ఆయనకు ప్రవేశం ఉన్నది. నౌ ఏ డేస్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీసే సత్తా రేవంత్‌‌లో పుష్కలమని విశ్వసించే వాళ్లు చాలానే ఉన్నారు. వెలుగు చూడని అనేక అంశాల పరంగా పాలకులకు కమిలిపోయేంతటి తొడపాశం పెట్టేది తానే అనే ఎక్స్‌పెక్టేషన్సు పెట్టుకున్నారు. చూడ్డానికి ఉట్టిపడే ఫిట్‌నెస్ ఆహార్యంగల రేవంత్‌రెడ్డి ఏజ్ ఎంతో తెలుసా! ఫిఫ్టీ ఇయర్సు. చూద్దాం, తెలంగాణ పొలిటికల్ తెరపై ఇంకా మున్ముందు ఎట్లాంటి ట్విస్ట్‌లు ఉంటాయో!

Tags:    

Similar News