నిజాంసాగర్‌ను పరిశీలించిన స్పీకర్ పోచారం.. ఏమన్నారంటే..!

దిశ, నిజాంసాగర్: భారీ వర్షాల నేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టు 1932లో నిర్మాణం పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో ఆయకట్టు పరిధిలోని 2 లక్షల […]

Update: 2021-09-28 08:12 GMT

దిశ, నిజాంసాగర్: భారీ వర్షాల నేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టు 1932లో నిర్మాణం పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో ఆయకట్టు పరిధిలోని 2 లక్షల 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నీటి తాకిడి ఎక్కువగా ఉందని.. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, మండల టీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డిలతో పాటు మండల టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.

Tags:    

Similar News