'సార్ ప్లీజ్.. మా పరీక్ష మమ్మల్నే రాసుకోనివ్వండి'
దిశ, రంగారెడ్డి: కొంతమంది విధులకు సరిగా హాజరుకాలేదు. అది పూడ్చుకునేందుకు తప్పుడు పనులకు పాల్పడ్డారు. ఆ ఊబిలోకి అమాయకులను లాగి వారిని రోడ్డుపాలు చేశారు. అది గమనించిన వీళ్లు మాకెందుకు ఆ గొడవ.. మీరే చేసుకోండి అంటూ పక్కకు జరిగారు. ఇదే అదునుగా భావించిన ఇంకొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మా పని మమ్మల్ని చేసుకోనివ్వండంటూ చెప్పేస్తున్నారు. అదేంటో మీరే చూడండి.. కొంతమంది టీచర్లు విద్యను బోధించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.. కానీ, మాస్ కాపీయింగ్ కు పాల్పడేందుకు […]
దిశ, రంగారెడ్డి: కొంతమంది విధులకు సరిగా హాజరుకాలేదు. అది పూడ్చుకునేందుకు తప్పుడు పనులకు పాల్పడ్డారు. ఆ ఊబిలోకి అమాయకులను లాగి వారిని రోడ్డుపాలు చేశారు. అది గమనించిన వీళ్లు మాకెందుకు ఆ గొడవ.. మీరే చేసుకోండి అంటూ పక్కకు జరిగారు. ఇదే అదునుగా భావించిన ఇంకొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మా పని మమ్మల్ని చేసుకోనివ్వండంటూ చెప్పేస్తున్నారు. అదేంటో మీరే చూడండి..
కొంతమంది టీచర్లు విద్యను బోధించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.. కానీ, మాస్ కాపీయింగ్ కు పాల్పడేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ దుస్థితి రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. ప్రతి ఏడాది ప్రైమరీ స్కూల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లో పాల్గొంటారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తోంది. ఎందుకంటే హైస్కూల్ ఉపాధ్యాయులకు పదో తరగతి సబ్జెక్టు బోధిస్తారు. దీంతో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రమాదం ఉంటుందని ఈ పద్ధతిని ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయి. ఈ ఏడాది నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఎస్జీటీ ఉపాధ్యాయులను దూరం చేసి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఉపాధ్యాయులకు డ్యూటీ వేశారు. ఉపాధ్యాయులు తమను రక్షించుకునేందుకు తప్పుడు విధానాలకు తెరలేపుతున్నట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తే తమ విద్యార్థులను పాస్ చేసుకునే అవకాశం ఉంటుందని, దీంతో ఉపాధ్యాయులకు విద్యార్థుల ఉత్తీర్ణత బట్టి సబ్జెక్టుల వారీగా పరిశీలించి ఇంక్రీమెంట్ వేస్తారన్న ధోరణితో ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.
ఆసక్తి చూపని ఎస్జీటీలు..
పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఎస్జీటీ ఉపాధ్యాయులు ఆసక్తి చూపడంలేదు. ఇదే అదునుగా భావించిన హైస్కూల్ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించేందుకు సిద్ధపడ్డారు. అయితే.. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో విధులు నిర్వర్తించిన ఎస్జీటీలను ఏడుగురిని డిస్మిస్ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ హైస్కూల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధుల్లో ఉన్న ఎస్జీటీలపై ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో వాళ్లు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించండంతో ఆ ఏడుగురు ఏస్జీటీలు సస్పెన్షన్‌తో పాటు డిస్మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. గతంలో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎస్జీటీలు ఈ పరీక్షల్లో విధులు నిర్వర్తించేందుకు సుముఖత చూపడంలేదని, ‘విధులు నిర్వర్తించి, ఒత్తిడికి లోనై మాస్ కాపీయింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఇదంతా మాకెందుకు వచ్చిన తంటా’ అన్న ధోరణితో వారు ఉన్నట్లు సమాచారం. ఇన్విజిలేటర్ విధులకు ఎస్జీటీలు హాజరు కాకపోవడంతో స్కూల్లు సెలవులున్నప్పటికీ టీచర్లు యథావిధిగా స్కూల్‌కు వెళ్లాలని ప్రిన్సిపల్ సెక్రటరీ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జిల్లాలో 208 పరీక్షా కేంద్రాలు..
నేటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏఫ్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో మొత్తం 937 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 208 పరీక్షాకేంద్రాలుగా గుర్తించారు. వాటిలో రెగ్యులర్ 201, ప్రైవేట్ పరీక్షాకేంద్రాలు 7 ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలకు 47,155 మంది రెగ్యులర్ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 1,450 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,025 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. ఇందులో 70 శాతం మంది స్కూల్ అసిస్టెంట్లే ఉన్నట్లు సమాచారం.
మా పరీక్షలు మేమే రాస్తాం..
విధులకు సక్రమంగా హాజరుకాని కొంతమంది ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గమనించిన కొంతమంది విద్యార్థులు మా పరీక్షలు మమ్ముల్నే రాసుకోనివ్వండంటూ అన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఉపాధ్యాయులు.. అలాంటి ఇన్విజిలెటర్స్ కారణంగా చదువులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు.
కరోనాతో జాగ్రత్తలు..
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పలువురు విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. పదేపదే నీళ్లు తాగేందుకు తమ వెంట వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు. మాస్కులు కూడా ధరించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం శానిటైజర్స్ ను ఏర్పాటు చేశారు.
Tags : mass copying, Rangareddy, Students, Teachers