కరోనా నివారణకు.. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి
దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని నివారించాలంటే ప్రజలందరూ తప్పని సరిగా సామాజిక దూరం పాటించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. శనివారం అజాంజాహీ మిల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న కూరగాయలు, నిత్యావసరాల వస్తువుల మార్కెట్ పనులను ఆయన పరిశీలించారు. సరుకులు కొనేందుకు వచ్చిన సమయంలో ప్రజలందరూ దూరంగా ఉండేలా మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌కు వచ్చిన వారు గుమిగూడితే వైరస్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే […]
దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని నివారించాలంటే ప్రజలందరూ తప్పని సరిగా సామాజిక దూరం పాటించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. శనివారం అజాంజాహీ మిల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న కూరగాయలు, నిత్యావసరాల వస్తువుల మార్కెట్ పనులను ఆయన పరిశీలించారు. సరుకులు కొనేందుకు వచ్చిన సమయంలో ప్రజలందరూ దూరంగా ఉండేలా మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌కు వచ్చిన వారు గుమిగూడితే వైరస్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు తమంతట తాము స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఒక్కొక్కరు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి వెళ్లిపోవాలన్నారు.అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రానికి మార్కెట్ ఏర్పాట్లు పూర్తవుతాయని ఆదివారం ఉదయం నుంచి కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, కార్పొరేటర్ జారతి అరుణ తదితరులు పాల్గొన్నారు.
Tags : social distance, corona control, warangal east mla, lockdown