దివాళీ సంబురాల్లో చేదుగా మారిన ‘సోన్ పాపిడి’!

దిశ, ఫీచర్స్ : కష్టాలను మతాబుల్లా కాల్చేసి, దీపపు కాంతుల్లాంటి వెలుగుల్ని దోసిట పట్టుకుని, మదినిండా నింపుకునే సంతోషాల పండుగే దీపావళి. ఇంటిల్లిపాది కలిసి ఎంజాయ్ చేసే పండుగల్లో ఇదీ ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే పండుగ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీపూజ చేయడం సాధారణం. చుట్టాలు, స్నేహితులను కలిసి మిఠాయిలను బహుమతులుగా అందజేయడం పరిపాటి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ సందర్భంగా తమ ఉద్యోగులకు స్వీట్స్‌ […]

Update: 2021-11-05 05:08 GMT

దిశ, ఫీచర్స్ : కష్టాలను మతాబుల్లా కాల్చేసి, దీపపు కాంతుల్లాంటి వెలుగుల్ని దోసిట పట్టుకుని, మదినిండా నింపుకునే సంతోషాల పండుగే దీపావళి. ఇంటిల్లిపాది కలిసి ఎంజాయ్ చేసే పండుగల్లో ఇదీ ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే పండుగ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీపూజ చేయడం సాధారణం. చుట్టాలు, స్నేహితులను కలిసి మిఠాయిలను బహుమతులుగా అందజేయడం పరిపాటి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ సందర్భంగా తమ ఉద్యోగులకు స్వీట్స్‌ సహా బోనస్ అందిస్తుంటాయి. కానీ ఈసారి ఎక్కువచోట సోన్ పాపిడితోనే సరిపెట్టేస్తుండటంతో జనాలు సోషల్ మీడియాలో ఈ స్వీట్‌పై మీమ్స్ సృష్టిస్తూ తమ నిరాశను తెలియజేస్తున్నారు.

తలంటు స్నానం, కొత్త బట్టలు, రంగోలీలకు తోడు ఎక్కడ చూసినా కనిపించే పండుగ అలంకరణలు, దీపపు వెలుగులు మనలో కొత్త కాంతిని నింపుతాయి. ఏదేమైనా ఇలాంటి పండుగ మూడ్‌ను సజీవంగా ఉంచేందుకు.. వర్చువల్ ప్రపంచంలో పండుగల సారాంశాన్ని, విశిష్టతను తెలిపే కథలెన్నో. అదేవిధంగా సందేశాలు, కోట్స్‌తో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు పండుగ శుభాకాంక్షలు అందించడం ఈ ఇంటర్నెట్ యుగంలో భాగమైపోయింది. ఇక పండుగ వేళల్లో జరిగే ఫన్నీ ఇన్సిండెంట్స్‌పై నెటిజన్లు పేల్చే జోక్స్, సర్కాస్టిక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఈ నేపథ్యంలోనే నోరూరించే వంటకాల గురించి జరిగే చర్చల్లో నెటిజన్లు, ఫుడ్ బ్రాండ్స్, టెక్ కంపెనీలు సోన్ పాపిడి జోక్స్‌తో అలరిస్తున్నాయి.

అమ్మ ఎప్పుడూ చెప్పేది.. ‘జీవితం సోన్ పాపిడి పెట్టె లాంటిది, మీరు ఏమిస్తే అదే మీకు లభిస్తుంది’ అంటూ స్విగ్గీ షేర్ చేసింది.

https://twitter.com/swiggy_in/status/1456198344116609024?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1456198344116609024|twgr^|twcon^s1_&ref_url=https://indianexpress.com/article/trending/trending-in-india/happy-diwali-2021-soan-papdi-jokes-dominate-social-media-as-people-celebrates-deepavali-7607364/

‘కాజు కట్లీ లేదా సోన్ పాపిడి? దీన్ని ఒకసారి పరిష్కరించుకుందాం’ అంటూ ట్విట్టర్ ఇండియా కూడా స్పందించింది. ఇక ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’
‘సోన్ పాపిడి కాకుండా కాజు కట్లీ లాగా మిమ్మల్ని చూసే వారితో డేట్ చేయండి’ అంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్ పేల్చింది. ఇక ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వన్ కూడా సోన్ పాపిడి మీమ్స్‌లో భాగంగా ఒకరి ఇంట్లో మరొకరు సోన్ పాపిడి స్వీట్లను పారేసుకుంటున్న ఫొటో పంచుకున్నారు.

‘ఈ సోన్ పాపిడి ఈరోజు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.. హ్యాపీ దివాళీ దోస్త్.. ఏ లో.. సోన్ పాపిడి ఖాలే’ ‘నా బంధువులు దీపావళి కానుకగా SOAN PAPDI ఇచ్చినప్పుడు.. మీరు కూడా అక్కడే ఆగిపోయారా? మీరు ఫైనాన్సియల్‌గా స్టేబుల్ అనుకున్నాను.. ఆ ఇల్లు, కారు మీవి కాదా?’, ‘త్వరలో ఎవరైనా సోన్ పాపిడి సిరీస్ ప్లాన్ చేస్తారేమో’, ‘మీరు హైస్కూల్‌లో ఎకనామిక్స్ చదవకపోతే – డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్(ఉపాంత రాబడిని తగ్గించే) కాన్సెప్ట్‌ను మీకు వివరిస్తాను. అదేంటంటే.. మీకు ఇష్టమైన మిఠాయ్‌ను మీరు తిన్నప్పుడు, తర్వాత తిన్న మిఠాయి నుంచి లభించే సంతృప్తి తగ్గుతూనే ఉంటుంది. అయితే నా విషయంలో గులాబ్ జామూన్, సోన్ పాపిడి ఎలా ఉంటాయంటే.. గులాబ్ జామూన్ పాజిటివిటి రేట్‌లో ఉంటే, సోన్ పాపిడి డిప్రెషన్ జోన్‌లో ఉంది. దీనికి కారణం గులాబ్ జామూన్ రుచికరమైనది నేను 15 నిమిషాల్లో సగం పెట్టె తినగలను. అదే సోన్ పాపిడితో అయితే ఒకే ఒక పీస్‌తో పూర్తి చేస్తాను. ప్రతీ అదనపు యూనిట్ – నాకు దుఃఖం, బాధ, కోపాన్ని తెస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News