నిరుపయోగంగా బస్ షెల్టర్.. ప్రయాణికులకు తప్పని తిప్పలు..

మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ షెల్టర్ నిరుపయోగంగా మారింది. జాతీయ రహదారి పక్కన ఉన్న బస్ షెల్టర్ చెత్తా చెదారంతో నిండి పోయింది.

Update: 2024-12-23 09:04 GMT

దిశ, నాగారం : మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ షెల్టర్ నిరుపయోగంగా మారింది. జాతీయ రహదారి పక్కన ఉన్న బస్ షెల్టర్ చెత్తా చెదారంతో నిండి పోయింది. కొంత మంది సైకిల్ మోటార్ వాహనదారులకు పార్కింగ్ గా మారడంతో నిరుపయోగంగా మారిందని, దీంతో బస్ షెల్టర్ లో కూర్చోడానికి కానీ, నిలబడటానికి గాని వీలు లేకుండా తయారైంది.

దీంతో నిత్యం ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి బస్ షెల్టర్ ను వినియోగం లోకి తెచ్చి, ప్రయాణికులకు ఉపయోగపడేలా చేయాలని, ఇబ్బందుల నుండి ఉపశమనం కల్గించే విధంగా సత్వరమే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, ప్రజలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News