రాయిగిరి పాఠశాల ఫుడ్ కమిటీ కు షోకాజ్ నోటీసులు..
రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఫుడ్
దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఫుడ్ కమిటీకి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం,నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని, లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు వండే విషయంలో పరిశుభ్రత పాటించాలన్నారు. మధ్యాహ్నం భోజనంలో సరిపడా పప్పు, కూరగాయలు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెడ్ మాస్టర్, పాఠశాల ఫుడ్ కమిటీ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు వారికి సరిపడా వండుతున్నారా లేదా అని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
బియ్యం మంచిగా వస్తున్నాయా అన్నం సన్నగా అయితుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వంట గదిలో ఎలుకలు తిరగకుండా బోన్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలో రోజు తనిఖీలు జరుగుతూనే ఉంటాయన్నారు. బిల్లులు పెండింగ్ ఉన్నవని హెడ్మాస్టర్ తెలుపడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విద్యాశాఖ అధికారితో మాట్లాడి పెండింగ్ లో ఉన్న బిల్లులు వేగవంతం చేయాలన్నారు. విద్యార్థితో కలెక్టర్ కొద్దిసేపు ముచ్చటించి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. విద్యార్థులకు ఇంగ్లీషులో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అండాలు తదితరులు పాల్గొన్నారు.