గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి.. వారికి ఉద్యోగాలిస్తూ ఉత్తర్వులు
దిశ, బెల్లంపల్లి : సింగరేణి అభివృద్ధికి భూములను కోల్పోయిన నిర్వాసితులకు సింగరేణిలో శాశ్వత ఉద్యోగాల కల్పనకు సంస్థ శ్రీకారం చుట్టింది. జీవో నెంబర్ 34 ప్రకారం సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్‌లలో భూములు, ఇండ్లు కోల్పోయిన 25 మంది నిర్వాసితులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మాల్రాజు శ్రీనివాసరావులు గోలేటీలో నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ […]
దిశ, బెల్లంపల్లి : సింగరేణి అభివృద్ధికి భూములను కోల్పోయిన నిర్వాసితులకు సింగరేణిలో శాశ్వత ఉద్యోగాల కల్పనకు సంస్థ శ్రీకారం చుట్టింది. జీవో నెంబర్ 34 ప్రకారం సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్‌లలో భూములు, ఇండ్లు కోల్పోయిన 25 మంది నిర్వాసితులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మాల్రాజు శ్రీనివాసరావులు గోలేటీలో నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి మాట్లాడుతూ.. సింగరేణిలోని మణుగూరు, ఇల్లందు, బెల్లంపల్లి ఏరియాల్లో ఏజెన్సీ ప్రాంతంలో సింగరేణి ఓపెన్ కాస్ట్‌లలో భూమిని, ఇండ్లను కోల్పోయిన వారికి జీవో నెంబర్ 34 ప్రకారం ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి ఏరియాలో సుమారు 140 మందికి ఈ అవకాశం వచ్చిందన్నారు. గతంలో సుమారు 75 మందికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేశామని వారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారని అన్నారు.
ఆదివారం రోజు మరో 25 మందికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేస్తున్నామని మిగతా 40 మందికి త్వరలో ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తామని అన్నారు. వీరంతా తమ ఉద్యోగాలలో రాణించి ఉన్నత పదవులు పొందాలని, సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.