మూడో‘సారీ’.. చర్చలు విఫలం
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ-1లో జరిగిన పేలుడులో మరణించిన కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో మూడో సారి జరిగిన చర్యలు విఫలం అయ్యాయి. మంగళవారం రాత్రి బాధిత కుటుంబానికి రూ.5లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో కార్మిక సంఘాల నాయకులు, బాధిత కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో బుధవారం జీఎం 1 ఆఫీసులో కార్మిక సంఘాల నాయకులతో రెండో ధఫా చర్చలు జరిగాయి. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50లక్షల చెల్లించాల్సిందేనని పట్టుబట్టాయి.అలాగే కుటుంబంలో ఒకరికి […]
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీ-1లో జరిగిన పేలుడులో మరణించిన కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో మూడో సారి జరిగిన చర్యలు విఫలం అయ్యాయి. మంగళవారం రాత్రి బాధిత కుటుంబానికి రూ.5లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో కార్మిక సంఘాల నాయకులు, బాధిత కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో బుధవారం జీఎం 1 ఆఫీసులో కార్మిక సంఘాల నాయకులతో రెండో ధఫా చర్చలు జరిగాయి. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50లక్షల చెల్లించాల్సిందేనని పట్టుబట్టాయి.అలాగే కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరాయి. ఇందుకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో రెండో సారి కూడా చర్చలు ఫెయిల్ అయ్యాయి. తిరిగి మధ్యాహ్నం మూడో సారి చర్చలు జరగగా కార్మిక సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్ ప్రకారం నడుచుకుంటేనే ఒప్పుకుంటామని లేనట్టయితే ఆందోళన చేస్తామని స్పష్టం చేశాయి. సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చల్లో కార్మిక సంఘాల నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిహారం సంస్థ చెల్లించి కాంట్రాక్టు కంపెనీ నుంచి వసూలు చేసుకోవాలని కూడా ప్రతిపాదన చేశారు. మరో వైపున అధికార పార్టీ నాయకులు బాధిత కుటుంబాలతో కూడా ప్రత్యేకంగా సమావేశమై పరిహారం అందించే విషయంలో చర్చలు జరిపారు. వారు కూడా కార్మిక సంఘాల డిమాండ్‌నే ముందు పెట్టడంతో పరిహారం అందించే విషయంలో తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఉదయం నుంచి పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కూడా తమవంతు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
కాంట్రాక్టు కార్మికుల బైకాడ్..
తమ సహచర కార్మికుల మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని, బ్లాస్టింగ్ కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు కార్మిక సంఘాలు చేసిన ప్రతిపాదన ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ పరిష్కరించకపోతే ఇక నుంచి విధుల్లో చేరేది లేదని రామగుండం రీజియన్‌లోని అన్ని బావుల్లో పనులు మానేస్తామని హెచ్చరించారు.