ఆస్పత్రిలో సింగరేణి ఉద్యోగుల ఆందోళన
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో స్కావెంజర్ గా పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికుడు కరోనాతో మృతి చెందడం కలలకం రేగింది. కోవిడ్ వార్డ్ లో సేవలందిస్తూ మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కోవిడ్ వార్డ్ ను సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి మరో చోటుకి మార్చాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. అలాగే […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో స్కావెంజర్ గా పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికుడు కరోనాతో మృతి చెందడం కలలకం రేగింది. కోవిడ్ వార్డ్ లో సేవలందిస్తూ మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కోవిడ్ వార్డ్ ను సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి మరో చోటుకి మార్చాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
కరోనా బారిన పడకుండా ఉండేందుకు వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. అలాగే సేవ చేస్తూ కరోనా సోకి చనిపోయిన స్కావెంజర్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, ఆస్పత్రి ఉద్యోగులు కోరుతున్నారు.