'కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి'
దిశ, తాండూర్: సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో మాదారం సివిల్ డిపార్ట్ మెంట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఈనెల 9, 10,11 తేదీలలో జరిగే సమ్మెకు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించి […]
దిశ, తాండూర్: సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో మాదారం సివిల్ డిపార్ట్ మెంట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఈనెల 9, 10,11 తేదీలలో జరిగే సమ్మెకు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించి సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుపతి, శివరాం, రెడ్డి, కార్మికులు బాపు, రాజు, నాందేవ్, బుచ్చయ్య, ఒదక్క, శకుంతల, లక్ష్మీ, మల్లీశ్వరి, తిరుపతమ్మ తదితరులు ఉన్నారు.