సింగరేణి రిటైర్డ్ కార్మికులకు గుడ్‌ న్యూస్..

దిశ, తాండూర్ : సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. పదవీ విరమణ పొందిన కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆర్జించిన లాభాల్లో 29 శాతం వాటాను సింగరేణి విస్తరించిన ఉన్న అన్ని ఏరియాల్లో పదవీ విరమణ పొందిన కార్మికుల ఖాతాల్లో ఈ నెల 20వ తేదిన డబ్బులు జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యాజమాన్యం అన్ని గనుల […]

Update: 2021-12-17 04:41 GMT

దిశ, తాండూర్ : సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. పదవీ విరమణ పొందిన కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆర్జించిన లాభాల్లో 29 శాతం వాటాను సింగరేణి విస్తరించిన ఉన్న అన్ని ఏరియాల్లో పదవీ విరమణ పొందిన కార్మికుల ఖాతాల్లో ఈ నెల 20వ తేదిన డబ్బులు జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యాజమాన్యం అన్ని గనుల అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. సింగరేణి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News