Telecom Sector: రూ. 4 లక్షల కోట్లు దాటిన టెలికాం కంపెనీల అప్పులు

ఈ మొత్తం అప్పులో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ అతి తక్కువగా రూ. 23,297 కోట్లు ఉన్నాయని మంత్రి తెలియజేశారు.

Update: 2024-11-27 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రధాన నాలుగు టెలికాం కంపెనీల మొత్తం అప్పులు రూ. 4,09,905 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తం అప్పులో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ అతి తక్కువగా రూ. 23,297 కోట్లు ఉన్నాయని బుధవారం పార్లమెంటులో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం టెల్కోల అప్పుల్లో వొడాఫోన్ ఐడియా అత్యధికంగా రూ. 2.07 లక్షల కోట్లకు చేరిందని, భారతీ ఎయిర్‌టెల్ రూ. 1.25 లక్షల కోట్లు, జియో ఇన్ఫోకాం రూ. 52,740 కోట్లుగా నమోదు చేశాయి. బీఎస్ఎన్ఎల్ 2021-22లో రూ. 40,400 కోట్ల నుంచి ప్రభుత్వ ఆర్థిక సహాయంతో గణనీయంగా తగ్గించగలిగింది. 2019లో రూ. 69 వేల కోట్లు, 2022లో రూ. 1.64 లక్షల కోట్ల మేర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు ప్యాకేజీ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్‌కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ. 89 వేల కోట్లను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు.   

Tags:    

Similar News