Telecom Companies Debts: టెలికం సంస్థల అప్పుల గురించి కేంద్రం ప్రకటన.. రూ. 2,07 లక్షల కోట్లతో వొడాఫోన్ ఐడియా ఫస్ట్ ప్లేస్..!

దేశంలోని టెలికాం కంపెనీల అప్పుల(Telecom Companies Debts) గురించి కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక ప్రకటన చేసింది.

Update: 2024-11-27 14:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని టెలికాం కంపెనీల అప్పుల(Telecom Companies Debts) గురించి కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక ప్రకటన చేసింది. ఈ రోజు పార్లమెంట్(Parliament)లో టెలికాం సంస్థల రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర టెలికాం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2024 మార్చి 31 వరకు టెలికాం సంస్థలకు రూ. 4,09,905 కోట్ల అప్పు ఉందని తెలిపారు. ఇందులో వొడాఫోన్ ఐడియా(Vi) రూ. 2,07,000 లక్షల అప్పుతో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇక భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) రూ. 1,25,000 లక్షలు, రిలయన్స్ జియో(Reliance Jio) రూ. 52,740 కోట్ల రుణాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL)కు రూ. 28,092 కోట్ల అప్పు మాత్రమే ఉందని తెలిపారు. కాగా  బీఎస్‌ఎస్ఎల్‌ కు(2022-23) ఫైనాన్సియల్ ఇయర్(FY)లో రూ. 40,400 కోట్ల రుణం ఉండగా.. ఎన్డీయే గవర్నమెంట్(NDA Govt) పలు దశల్లో ప్రకటించిన పునరుద్ధణ ప్యాకేజీ(Renewal package) కారణంగా అప్పులు తగ్గాయని వెల్లడించారు. ఇక బీఎస్‌ఎస్ఎల్‌ 4G/5G స్పెక్ట్రమ్ కోసం రూ.89,00,00 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 

Tags:    

Similar News