గల్లంతైన సింధూరెడ్డి మృతదేహం లభ్యం 

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రెండ్రోజుల కిందట కలుగోట్ల వాగులో గల్లంతైన సింధూరెడ్డి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. వివరాల్లోకివెళితే.. శనివారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు సింధూరెడ్డితో పాటు మరో ఇద్దరు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల వాగు దాటుతున్న క్రమంలో నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మిగతా ఇద్దరు క్షేమంగా బయట పడగా సింధూరెడ్డి గల్లంతైంది. ఈ ఘటన జరిగిన స్థలానికి 500 […]

Update: 2020-07-27 06:34 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రెండ్రోజుల కిందట కలుగోట్ల వాగులో గల్లంతైన సింధూరెడ్డి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. వివరాల్లోకివెళితే.. శనివారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు సింధూరెడ్డితో పాటు మరో ఇద్దరు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల వాగు దాటుతున్న క్రమంలో నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మిగతా ఇద్దరు క్షేమంగా బయట పడగా సింధూరెడ్డి గల్లంతైంది.

ఈ ఘటన జరిగిన స్థలానికి 500 మీటర్ల దూరంలోనే తుంగభద్ర నది ఉండటంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోయింది. సోమవారం కూడా రెస్క్యూ బృందం ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, గల్లంతైన సింధూరెడ్డి మృతదేహం కర్నూలు పట్టణంలోని తుంగభద్ర నదిలో లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News