ఇంగ్లాండ్‌లో షాట్ సెలెక్షనే ముఖ్యం : విహారి

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పిచ్‌లపై మనకు ఇష్టం వచ్చిన షాట్లు ఆడటానికి వీలుండదని.. బంతి పడిన తర్వాత జాగ్రత్తగా గమనించి షాట్‌ను ఎంపిక చేసుకోవాలని టీమ్ ఇండియా ఆటగాడు హనుమ విహారి అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో అతడు జట్టులోని ఇతర క్రికెటర్లకు సలహాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారి.. త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ‘ఇంగ్లాండ్‌లో పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. అక్కడ ఆటకు […]

Update: 2021-06-05 10:32 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పిచ్‌లపై మనకు ఇష్టం వచ్చిన షాట్లు ఆడటానికి వీలుండదని.. బంతి పడిన తర్వాత జాగ్రత్తగా గమనించి షాట్‌ను ఎంపిక చేసుకోవాలని టీమ్ ఇండియా ఆటగాడు హనుమ విహారి అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో అతడు జట్టులోని ఇతర క్రికెటర్లకు సలహాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారి.. త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ‘ఇంగ్లాండ్‌లో పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. అక్కడ ఆటకు వాతావరణం కూడా కీలకంగా మారుతుంది.

ఎండ ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు, మబ్బులు కమ్మితే బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు లేనప్పుడు బంతి స్వింగ్ అవుతూ ఉంటుంది. అందులో మనం రెగ్యులర్‌గా వాడని డ్యూక్ బంతులు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. డ్యూక్ బంతులపై సీమ్ ఉండటమే కారణం. అందుకే బంతిని జాగ్రత్తగా గమనించి షాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా ఓపిక పడితే ఈజీగా షాట్లు ఆడవచ్చు’ అని హనుమ విహారి చెప్పాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ ఈ చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటింగ్ సులభంగా మారుతుందని చెప్పాడు.

Tags:    

Similar News