Jagapathi Babu: స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న జగపతి బాబు.. నిజంగా మీరు గ్రేట్ సార్ అంటున్న నెటిజన్లు(వీడియో)
ప్రముఖ నటుడు జగపతిబాబు మనందరికీ సుపరిచితమే. అప్పట్లో సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు.
దిశ, సినిమా: ప్రముఖ నటుడు జగపతిబాబు మనందరికీ సుపరిచితమే. అప్పట్లో సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. ఆ తర్వాత విలన్‌గా మారి మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. విలన్ రోల్ ప్లే చేస్తే తనకంటే ఎవరూ అంత బాగా చేయరేమో అన్నట్టు జీవించేస్తారు ఆ పాత్రలో. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా జగపతి బాబు విలన్‌గా నటించిన సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అనే చెప్పాలి. సాధారణంగా హీరోగా నటించిన వ్యక్తి నెగెటీవ్ షేడ్‌లో అంతగా మెప్పించలేరు. కానీ, జగపతి బాబు మాత్రం హీరో కంటే విలన్ రోల్‌లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్‌లో రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద ఫుడ్‌ను ఆరగించారు జగపతి బాబు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూటికీ ఈ మనిషి రోడ్డున పడ్డాడు’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు మీరు నిజంగా గ్రేట్ సార్ సాధారణ వ్యక్తిలా స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు, చాలా మంది స్ట్రీట్ బండ్ల వైపు చూడడానికి కూడా ఇష్టపడరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.