CM Revanth Reddy: ‘ఆ ప్రచారం నమ్మొద్దు.. పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?’

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-12-26 13:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో(Sandya Theatre) పుష్ప 2(Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన పై ఇటీవల చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police) అల్లు అర్జున్‌ను విచారణ జరిపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. పుష్ప-2 మూవీ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పే సమయంలో సీఎం రేవంత్ పేరు మర్చిపోయారని.. అందుకే అరెస్ట్ చేయించారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్‌ను తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న ప్రచారం పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. ‘ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్ పై ఉంది కదా? సామాజిక అంశాలపై ప్రచార చిత్రాలు చేయాల్సిందే.. మా అసోసియేషన్‌కు కావాలంటే స్థలాలు ఇస్తాం. ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీ కలిసి పనిచేయాలి’ అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే.

Read More...

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ పై స్పందించిన హీరోయిన్


Tags:    

Similar News