మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు: స్పీకర్ గడ్డం ప్రసాద్
భారతదేశ పూర్వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు...
దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశ పూర్వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప ఆర్ధికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు. 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు.వారి మరణం దేశానికి తీరని లోటు అన్నారు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు