Telangana Police: సరదా పడుతున్నారని మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా?
పిల్లలు ఏడుస్తున్నారనో.. మారాం చేస్తున్నారో ఇంట్లోని పెద్దలు సెల్‌ఫోన్‌లు, బైకులు ఇచ్చి వారిని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు ఏడుస్తున్నారనో.. మారాం చేస్తున్నారో ఇంట్లోని పెద్దలు సెల్‌ఫోన్‌లు, బైకులు ఇచ్చి వారిని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్లు తీసుకున్న పిల్లలు పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్‌లోడ్ చేసి అకౌంట్ ఖాళీ చేయడం, బైకు తీసుకున్న పిల్లలు రోడ్లపై ప్రమాదాలకు కారణం అవుతుండటం మనం తరచూ చూస్తుంటాం. దీంతో మైనర్లకు వాహనాలు ఇచ్చేవారికి తెలంగాణ పోలీసులు(Telangana Police) కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘పిల్లల సరదా కోసం మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా? మీరు చేసే పని మీతో పాటూ ఇతరుల్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంది. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే ఆ తల్లిదండ్రులదే బాధ్యత. వారు కూడా జైలుకు వెళ్లక తప్పదు’ హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా 31st నైట్ సమీపిస్తుండటంతో పోలీసులు నిబంధనలు మరింత కఠినతరం చేశారు. మద్యం సేవించి రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పిల్లల సరదా కోసం మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా? మీరు చేసే పని మీతో పాటూ ఇతరుల్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంది. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే ఆ తల్లిదండ్రులదే బాధ్యత. వారు కూడా జైలుకు వెళ్లక తప్పదు.
— Telangana Police (@TelanganaCOPs) December 27, 2024
#TelanganaPolice #MinorDriving #RashDriving pic.twitter.com/ncUzW6QVjA