Formula E-Car Race: ఫార్ములా- ఈ కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా-ఈ కారు రేస్‌ (Formula-E Car Race) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-12-28 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కారు రేస్‌ (Formula-E Car Race) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీ లాండరింగ్‌ (Money Laundering), పెమా నిబంధనలు (FEMA Regulations) ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు ఈడీ (Enforcement Directorate) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్‌ (KTR)తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (Aravind Kumar), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి (BLN Reddy)లకు కూడా ఈడీ (ED) నోటీసులు అందజేసింది. అయితే వారిని మాత్రం జనవరి 2 లేదా 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో ఈడీ తెలిపింది.

కాగా, ఏసీబీ (ACB) ఎఫ్‌ఐఆర్‌ (FIR) ఆధారంగా పీఎంఎల్‌ఏ (PMLA) కింద విచారణ చేపడుతుతోన్న ఈడీ (Enforcement Directorate) ఆ ముగ్గురు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఈఓ (FEO)కు రూ.55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌‌కు నోటీసులు జారీ చేశారు.  

Tags:    

Similar News