కొత్త చార్జ్ షీట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన జానీ మాస్టర్
లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటు జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ కొద్ది రోజుల క్రితం బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణల(sexual assault) కేసును ఎదుర్కొంటు జైలుకు వెళ్లిన జానీ మాస్టర్(Johnny Master) కొద్ది రోజుల క్రితం బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో జానీ మాస్టర్ కు ఊహించని విధంగా షాక్ తగిలింది. లైంగిక దాడికి సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. బుధవారం పోలీసులు కొత్త చార్జిషీట్(New charge sheet)ను ధాఖలు చేశారు. అందులో లేడీ కొరియోగ్రాఫర్(Lady choreographer) ను ఈవెంట్లకు బయటకు తీసుకెళ్లినప్పుడు.. జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు తేల్చారు. దీంతో మరోసారి జానీ మాస్టర్ ను అరెస్ట్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా తాజా చార్జ్ షీట్ పై జానీ మాస్టర్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.." నేను నిందితుడిని మాత్రమే.. నిర్దోషిగా బయటికొస్తాను. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. అభిమానుల ప్రేమ తనపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా" అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.