Naveen Policetty: నవీన్ పొలిశెట్టి ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్

‘జాతిరత్నాలు’ సినిమాతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ (youthful entertainer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి

Update: 2024-12-26 09:22 GMT

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ (youthful entertainer)గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’ (Anaganaga Okaraju). ఈ సినిమాతో కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజైన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. అంతే కాకుండా.. టీజర్ రిలీజ్‌తో పాటు ప్రీ వెడ్డింగ్ వీడియో (Pre wedding video) కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రీ వెడ్డింగ్ వీడియో రానే వచ్చింది.

ఈ వీడియోలో ‘ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డు (Plate Gold).. స్వీటు గోల్డు (Sweet Gold) అంటున్నారు. ఇదేమైనా మలబార్ గోల్డ్ (Malabar Gold) వాళ్ల పెళ్లా’ అనే డైలాగ్స్ హైలెట్‌గా నిలవగా.. ‘ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ.. నెక్ట్స్ ఇయర్ అంతా రాజు గాడి వెడ్డింగే’ అంటూ నవీన్ పొలిశెట్టి చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. అలాగే.. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary)ని కన్ఫార్మ్ చేశారు మేకర్స్. మన రాజుకి కాబోయే భార్యగా రాణిగా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షీ చౌదరి లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్ అవుతుండగా.. మరో బ్లాక్ బస్టర్‌కు మా నవీన్ పొలిశెట్టి సిద్ధం అంటూ కామెంట్స్ పెడున్నారు నెటిజన్లు. కాగా.. ఈ చిత్రాన్ని పిడివి ప్రసాద్ సమర్పణలో సితారఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.


Full View


Tags:    

Similar News