Vivek Oberoi: తనని అలా చూసేసరికి తట్టుకోలేక పోయాను.. స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్
‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వివేక్ ఒబెరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, సినిమా: ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వివేక్ ఒబెరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయన.. టాలీవుడ్‌లో మాత్రం విలన్ రోల్స్‌లో నటించి మెప్పిస్తున్నాడు. అంతేకాదు గతంలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌తో లవ్ ట్రాక్ నడిపి హాట్ టాపిక్ అయ్యాడు. కానీ కొన్నేళ్లకే వీరి ప్రేమ ట్రాక్ పట్టాలు తప్పింది. ఇక ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతున్న వివేక్.. రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఫస్ట్ టైం నేను లవ్‌లో పడ్డాను. నాకంటే ఏడాది చిన్నది ఆమె. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనతో నా ప్రేమ స్టార్ట్ అయింది. తనే నా జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయ్యాను. పెళ్లి, పిల్లలు అంటూ జీవితం మొత్తం ఊహించుకున్నాను. కానీ ఒకసారి తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నేను జ్వరం అనుకున్నాను. రెస్ట్ తీసుకుని మళ్లీ వచ్చేస్తుందని అనుకున్నాను. కానీ చాలా రోజులు కనిపించలేదు. ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. దీంతో ఆమె బంధువులకు ఫోన్ చేస్తే తను ఆస్పత్రిలో ఉందని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే తనకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని తెలిసింది.
హాస్పిటల్ బెడ్ పై తనను అలా చూసి తట్టుకోలేక పోయాను. రెండు నెలల్లోనే తను నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. తనను మర్చిపోయి మళ్లీ మనిషిగా మారడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాతే క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు నా వంతు సాయం చేయాలనే ఆలోచన మొదలైంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.