ఆ షూటర్ ఆప్ కార్యకర్త !
షాహిన్‌బాగ్‌లో కాల్పులకు పాల్పడిన వ్యక్తికి ఆమ్ అద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయని మంగళవారం పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం షాహిన్‌బాగ్‌లోని పోలీస్ బ్యారికేడ్ల వద్ద నిల్చుని కపిల్ గుజ్జార్(25) గాలిలోకి కాల్పులు జరుపుతూ ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో అతను ఆప్ కార్యకర్త అని వెల్లడైంది. పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకిస్తూ 50 రోజులుగా షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. […]
షాహిన్‌బాగ్‌లో కాల్పులకు పాల్పడిన వ్యక్తికి ఆమ్ అద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయని మంగళవారం పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం షాహిన్‌బాగ్‌లోని పోలీస్ బ్యారికేడ్ల వద్ద నిల్చుని కపిల్ గుజ్జార్(25) గాలిలోకి కాల్పులు జరుపుతూ ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో అతను ఆప్ కార్యకర్త అని వెల్లడైంది. పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకిస్తూ 50 రోజులుగా షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత శనివారం కపిల్ గుజ్జార్ అక్కడికి చేరుకున్నాడు. తుపాకీ బయటకు తీసి గాలిలోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన ఆందోళనకారులు రాళ్లు విసిరారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కపిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కపిల్ ‘ఈ దేశంలో కేవలం హిందువుల మాట మాత్రమే చెల్లుతుందని, ఇంకెవరిదీ కాదు’ అని అరిచాడు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఏడాది క్రితం కపిల్ గుజ్జార్, అతని తండ్రి ఆప్‌లో చేరినట్లు తేలిందని క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారి రాజేశ్ తెలిపారు. ఆ ఫొటోల్లో ఆప్ సీనియర్ నేతలు అతిషి, సంజయ్‌సింగ్‌తో ఉన్నారని చెప్పారు.