Hyderabad : మేయర్ మిస్సింగ్ అంటూ ప్రజావాణిలో ఫిర్యాదు

హైదరాబాద్‌(Hyderabad) నగర మేయర్ కనబడటం లేదంటూ మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్(Corporator Shravan) సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Update: 2025-03-24 13:33 GMT
Hyderabad : మేయర్ మిస్సింగ్ అంటూ ప్రజావాణిలో ఫిర్యాదు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad) నగర మేయర్ కనబడటం లేదంటూ మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్(Corporator Shravan) సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలోని సమస్యలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwala Vijalakshmi) శ్రద్ధ చూపడం లేదని, ఆమె కనీసం కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండడం లేదని శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన GHMC ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. శ్రవణ్ మాట్లాడుతూ, నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నప్పటికీ, మేయర్ విజయలక్ష్మి వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సమస్యలను స్వయంగా పరిశీలించడానికి ఆమె ఫీల్డ్ విజిట్‌లు చేయడం లేదని, అలాగే GHMC కార్యాలయంలో కూడా ఆమె లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, చెత్త సమస్య, రోడ్ల దుస్థితి వంటి విషయాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, వీటిపై మేయర్ దృష్టి సారించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కాగా గతంలో కూడా ఆమె పనితీరుపై పలు విమర్శలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపై GHMC అధికారుల నుంచి గాని మేయర్ కార్యాలయం నుంచి గాని ఇంతవరకు అధికారిక స్పందన రాలేదు.

Tags:    

Similar News