మంత్రుల పర్యటన.. పోలీసుల అదుపులో అధ్యక్షుడు

దిశ, జమ్మికుంట: ఎస్ఎఫ్ఐ అధికారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.  విద్యారంగాన్ని గాలికి వదిలేసి హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న మంత్రులను అడ్డుకుంటామని ప్రకటించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అప్పని హరీష్‌ వర్మను బుధవారం తెల్లవారు జామున వీణవంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా… రాష్ట్ర మంత్రులు అవేమీ పట్టించుకోకుండా, సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మునిగి పోతున్నారని […]

Update: 2021-08-10 23:17 GMT

దిశ, జమ్మికుంట: ఎస్ఎఫ్ఐ అధికారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. విద్యారంగాన్ని గాలికి వదిలేసి హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న మంత్రులను అడ్డుకుంటామని ప్రకటించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అప్పని హరీష్‌ వర్మను బుధవారం తెల్లవారు జామున వీణవంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా… రాష్ట్ర మంత్రులు అవేమీ పట్టించుకోకుండా, సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మునిగి పోతున్నారని హరీష్ వర్మ మండిపడ్డాడు. అంతే కాకుండా విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు హుజురాబాద్ కు వచ్చే పర్యటనను అడ్డుకుంటామని ఆయన మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలపడంతో పోలీసులు ముందస్తుగా హరీష్ వర్మ తో పాటు బత్తుల రాజు, ఓం ప్రకాష్ యాదవ్‌లను స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా హరీష్ దిశ‌తో మాట్లాడుతూ.. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, నిర్బంధ పాలన ఎక్కువ రోజులు సాగవని, పాలన సక్కగా ఉంటే ప్రశ్నించేవారు తక్కువ అవుతారని అన్నారు.

 

Tags:    

Similar News