గుండెపోటుతో సీనియర్ ఉపాధ్యాయుడు మృతి
దిశ, గోదావరిఖని: గోదావరిఖనిలో గత 35 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో విద్యాభ్యాసం అందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేసిన సీనియర్ ఉపాధ్యాయులు వై.సత్యనారాయణ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాదులోని తన సోదరుడి ఇంట్లో ఉండగా ఉదయం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల పలు పాఠశాల కరస్పాండెంట్లు, అధ్యాపక బృందం సంతాపం ప్రకటించాయి. ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు. సత్యనారాయణ మృతి పట్ల ట్రస్మా […]
దిశ, గోదావరిఖని: గోదావరిఖనిలో గత 35 సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో విద్యాభ్యాసం అందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేసిన సీనియర్ ఉపాధ్యాయులు వై.సత్యనారాయణ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాదులోని తన సోదరుడి ఇంట్లో ఉండగా ఉదయం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల పలు పాఠశాల కరస్పాండెంట్లు, అధ్యాపక బృందం సంతాపం ప్రకటించాయి. ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు. సత్యనారాయణ మృతి పట్ల ట్రస్మా స్టేట్ ఎక్సిక్యూటివ్ జనరల్ సెక్రెటరీ ఆరకాల రామ్ చందర్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఆధార్ సండే సమ్మరావు, పెద్దపెల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు పరుపటి అంజరెడ్డి, రామగుండం అధ్యక్షులు బండారపు యాదగిరి గౌడ్, రామగుండం జనరల్ సెక్రెటరీ కొత్తకాపు శ్రీనివాస్ రెడ్డిలు సంతాపం ప్రకటించారు.