డబ్ల్యూటీసీ ఫైనల్‌కోసం 35 మంది ప్రాబబుల్స్

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇండియా, న్యూజీలాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లో ఈ టెస్టు జరుగనున్నది. ఈ టెస్టులో ఆడబోయే టీమ్ ఇండియా జట్టు కోసం 22 నుంచి 24 మందితో కూడిన సభ్యులను ప్రాబబుల్స్‌ నుంచి ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బృందాన్ని బీసీసీఐ ఆదేశించింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్నా షెడ్యూల్ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ, […]

Update: 2021-04-30 10:53 GMT

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇండియా, న్యూజీలాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లో ఈ టెస్టు జరుగనున్నది. ఈ టెస్టులో ఆడబోయే టీమ్ ఇండియా జట్టు కోసం 22 నుంచి 24 మందితో కూడిన సభ్యులను ప్రాబబుల్స్‌ నుంచి ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బృందాన్ని బీసీసీఐ ఆదేశించింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్నా షెడ్యూల్ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ, ఈసీబీ ఇప్పటికే స్పష్టం చేశాయి. కాగా, ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను సెలెక్షన్ కమిటీ బీసీసీఐకి అందజేసింది. అయితే వీరిలో నుంచి గరిష్టంగా 24 మందిని ఎంపిక చేయాలని బీసీసీఐ కోరింది. కేవలం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసమే కాకుండా.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కూడా అదే జట్టు పాల్గొనే అవకాశం ఉన్నది. మరోవైపు డబ్ల్యూటీసీ టెస్టు కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియా కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయనున్నది. ఐపీఎల్ ముగిసిన వెంటనే వీరందరూ ఇంగ్లాండ్ బయలుదేరుతారు.

Tags:    

Similar News