BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సాత్విక్-చిరాగ్
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్‌సాయిరాజ్ – చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సీజన్ చివరిదైన BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి భారత డబుల్స్ ప్లేయర్స్ వీళ్లే. వరల్డ్ నెంబర్ 11 జోడి గతవారం జరిగిన ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయారు. అయితే జపాన్ జోడి అకిరా కోగా – తైచీ సాయిటో కూడా మలేషియా ఓపెన్ సెమీస్‌లో ఓడిపోవడంతో భారత జోడికి అర్హత లభిచింది. […]
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్‌సాయిరాజ్ – చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సీజన్ చివరిదైన BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి భారత డబుల్స్ ప్లేయర్స్ వీళ్లే. వరల్డ్ నెంబర్ 11 జోడి గతవారం జరిగిన ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయారు. అయితే జపాన్ జోడి అకిరా కోగా – తైచీ సాయిటో కూడా మలేషియా ఓపెన్ సెమీస్‌లో ఓడిపోవడంతో భారత జోడికి అర్హత లభిచింది. ‘గతవారం సెమీస్‌లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉన్నది. కానీ, మేము వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించినందకు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ టూర్‌లో పాల్గొనడం ఇదే తొలి సారి. టాప్ 8 జోడీలతో ఆడటానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాము.’ అని చిరాగ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఇప్పటి వరకు పీవీ సింధు మాత్రమే BWF ఫైనల్ విజేతగా నిలిచింది. సైనా 2011లో నాకౌట్ దశకు చేరుకున్నా ఫైనల్ మాత్రం చేరుకోలేక పోయింది.