Tirumala News:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు

తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.

Update: 2024-12-22 11:36 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఇవాళ(ఆదివారం) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, వేద ఆశ్వీరచనం చేశారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంచు విష్ణుతో పాటు వైసీపీ ఎంపీ(YCP MP) తనూజ రాణి(Tanuja Rani) కూడా ఉన్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారికి టీటీడీ(TTD) అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇకపోతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Tags:    

Similar News