‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్.. చరణ్‌కు నేషనల్ అవార్డు రావాలంటూ..(వీడియో)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) కాంబోలో రాబోతున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer).

Update: 2024-12-22 11:38 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) కాంబోలో రాబోతున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer). దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి(Anjali), సునీల్(Sunil), సముద్ర ఖని(Samudrakani), ఎస్ జె సూర్య(Sj Surya) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌‌ను డిసెంబర్ 21 తేదీన డెల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ఈవెంట్‌కి స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సుకుమార్ మాట్లాడుతూ.. ‘నేను ప్రతి హీరోని సినిమా చేస్తున్నప్పుడు ప్రేమిస్తాను. ఆ హీరోతో ఒక రెండేళ్లు ట్రావెల్ చేస్తాను. సినిమా అయినంత సేపు ఆ హీరోతో కనెక్ట్ అవుతాను. సినిమా అయ్యాక నేనెవరితో కనెక్ట్ అయి ఉండను. కానీ ‘రంగస్థలం’ అయిన తర్వాత కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక్క హీరో రామ్ చరణ్. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. నా బ్రదర్ లాంటి వాడు. మీకు ఒక రహస్యం చెప్తాను.

చిరంజీవి సర్‌తో కలిసి నేను ఈ గేమ్ ఛేంజర్ సినిమా చూశాను. కాబట్టి మీకు ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. శంకర్ గారి సినిమాలు ‘జెంటిల్‌మెన్’, ‘భారతీయుడు’ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమా అప్పుడు అంత ఎంజాయ్ చేశాను. ‘రంగస్థలం’ సినిమాకు రామ్ చరణ్‌కు కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను. కానీ, ఈ సినిమా క్లైమాక్స్‌లో తన ఎమోషన్ చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఎంత బాగా చేశాడంటే దీనికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది’ అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News