కంకోల్‌లో పాదచారులకు అన్నదానం
దిశ, మెదక్: ఆందోల్ నియోజకవర్గంలోని కంకోల్ టోల్ గేట్ వద్ద మేళాసంగం సర్పంచ్ శ్రీనివాస్, ఆయన మిత్రులు కలిసి రహదారిపై వెళ్లే పాదచారులకు అన్నదానం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పాదచారులకు భోజనం వడ్డించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడానికి ముందుకొచ్చిన శ్రీనివాస్, వారి మిత్ర బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కేంద్రం నుంచి ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్లొచ్చిన రెండు కుటుంబాలను […]
దిశ, మెదక్: ఆందోల్ నియోజకవర్గంలోని కంకోల్ టోల్ గేట్ వద్ద మేళాసంగం సర్పంచ్ శ్రీనివాస్, ఆయన మిత్రులు కలిసి రహదారిపై వెళ్లే పాదచారులకు అన్నదానం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పాదచారులకు భోజనం వడ్డించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడానికి ముందుకొచ్చిన శ్రీనివాస్, వారి మిత్ర బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కేంద్రం నుంచి ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్లొచ్చిన రెండు కుటుంబాలను ఆయన కలిసి, వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు పాటించాలని కోరారు. అయితే, వీరికి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు స్థానిక ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వీరు క్వారంటైన్‌లో ఉన్నట్టు వెల్లడించారు.
Tags: free meals to pedestrians, kankol toll gate, andhol MLA kranthi kiran, corona, virus, lockdown