కరోనాకు రూ.100 కోట్లు… సచివాలయానికి రూ.500 కోట్లా?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాదోళనకు గురవుతున్నారు. దీంతో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో తాను దీక్ష చేస్తానని హెచ్చరించారు. తన నియోజక వర్గ కేంద్రమైన సంగారెడ్డి ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని, వెంటనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాదోళనకు గురవుతున్నారు. దీంతో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో తాను దీక్ష చేస్తానని హెచ్చరించారు.
తన నియోజక వర్గ కేంద్రమైన సంగారెడ్డి ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని, వెంటనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు రూ.100 ప్రకటించి, సచివాలయానికి రూ.500 కోట్లు ప్రకటించడంపై విచారం వ్యక్తం చేశారు.