పవన్‌ను ఆకాశానికెత్తేసిన మలయాళీ భామ.. విషయమేంటో?

దిశ, సినిమా : పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌, రానా మల్టీస్టారర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్‌’. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుండగా.. రానాకి జోడిగా మలయాళ కథానాయిక సంయుక్త మీనన్‌ను ఎంపిక చేశారు మేకర్స్. ఈ విషయాన్ని సంయుక్త స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, రానాకు పెయిర్‌గా […]

Update: 2021-10-05 03:59 GMT

దిశ, సినిమా : పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌, రానా మల్టీస్టారర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్‌’. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుండగా.. రానాకి జోడిగా మలయాళ కథానాయిక సంయుక్త మీనన్‌ను ఎంపిక చేశారు మేకర్స్. ఈ విషయాన్ని సంయుక్త స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, రానాకు పెయిర్‌గా నటించే చాన్స్ దక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేందుకు ఇంతకు మించిన బ్యూటిఫుల్ డెబ్యూ కావాలని కోరుకోవడం లేదు. ఈ సంక్రాంతి మాసివ్‌గా ఉండబోతోంది’ అని ట్వీట్ చేసింది. కాగా సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న మూవీకి త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తుండగా.. సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News