అసౌకర్యానికి చింతిస్తున్నాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థులు పడిన ఇబ్బందులను ‘దిశ’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ‘బస్సులేక.. రాత్రి రోడ్డుపై విద్యార్థుల ఎదురుచూపులు’ అనే శీర్షికన వచ్చిన ఈ వార్తకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. మానకొండూరులో ట్రాఫిక్ జాం కారణంగా సకాలంలో బస్సులు నడపలేకపోయామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మోడల్ స్కూల్ యాజమాన్యాన్ని సమన్వయం చేసుకుని సకాలంలో ఆర్టీసీ బస్సులు […]
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థులు పడిన ఇబ్బందులను ‘దిశ’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ‘బస్సులేక.. రాత్రి రోడ్డుపై విద్యార్థుల ఎదురుచూపులు’ అనే శీర్షికన వచ్చిన ఈ వార్తకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. మానకొండూరులో ట్రాఫిక్ జాం కారణంగా సకాలంలో బస్సులు నడపలేకపోయామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మోడల్ స్కూల్ యాజమాన్యాన్ని సమన్వయం చేసుకుని సకాలంలో ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని సజ్జనార్ వెల్లడించారు.
For publication of rejoinder in the interest of students pl pic.twitter.com/CiyvLGZXEK
— RM KRMR TSRTC (@rm_krmr) November 10, 2021