‘దళితబంధు’పై RS ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో లాంచ్ చేయనున్న ‘దళితబంధు’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి స్కీం లేదని KCR గారు వాసాలమర్రిలో చెప్పిండ్రు. అవును. ఎలాంటి విశ్లేషణ, రూల్సు కూడా లేకుండా, ఎంపిక పారదర్శకంగా జరపకుండా, శిక్షణ ఇవ్వకుండా, […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో లాంచ్ చేయనున్న ‘దళితబంధు’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి స్కీం లేదని KCR గారు వాసాలమర్రిలో చెప్పిండ్రు. అవును. ఎలాంటి విశ్లేషణ, రూల్సు కూడా లేకుండా, ఎంపిక పారదర్శకంగా జరపకుండా, శిక్షణ ఇవ్వకుండా, రూ.500 కోట్ల ప్రజాధనాన్ని మనోళ్లకు ఆగస్టు 16న హుజూరాబాదులో పబ్లిక్‌గా ఇస్తారన్నమాట. ఇది ముమ్మాటికీ ప్రపంచ రికార్డే!’’ అని తనదైన శైలీలో విమర్శించారు.
ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి స్కీం లేదని KCR గారు వాసాలమర్రిలో చెప్పిండ్రు. అవును. ఎలాంటి విశ్లేషణ,రూల్సు కూడా లేకుండా, ఎంపిక పారదర్శకంగా జరపకుండా, శిక్షణ ఇవ్వకుండా, ₹500 కోట్ల ప్రజాధనాన్ని మనోళ్లకు ఆగస్టు 16 న హుజూరాబాదులో పబ్లిగ్గా ఇస్తరన్నమాట. ఇది ముమ్మాటికీ ప్రపంచ రికార్డే! pic.twitter.com/3hNuXZ4qUI
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 14, 2021