పార్కింగ్​ రూల్స్ బ్రేక్.. రూ.లక్ష జరిమానా : జీహెచ్ఎంసీ

దిశ, తెలంగాణ బ్యూరో : పార్కింగ్​ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు వేర్వేరు షాపింగ్​మాల్​, కాంప్లెక్స్​లపై రూ. లక్ష జరిమానాను జీహెచ్ఎంసీ విధించారు. తన వద్ద నుంచి పార్కింగ్​ ఫీజు రూ.30 వసూలు చేశారని ఓ వ్యక్తి ట్విట్టర్​లో ఫిర్యాదు చేయగా.. అమీర్​ పేటలోని పావని ప్రెస్టేజీ. కాంప్లెక్స్​ కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.50వేల జరిమానా విధించారు. ఈ నెల 28న అహుజా ఎస్టేట్​ లోని న్యూ సంతోష్​ దాబాలో కొనుగోలు చేసినప్పటికీ పార్కింగ్ ​ఫీజు తీసుకున్నారని […]

Update: 2021-04-29 12:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్కింగ్​ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు వేర్వేరు షాపింగ్​మాల్​, కాంప్లెక్స్​లపై రూ. లక్ష జరిమానాను జీహెచ్ఎంసీ విధించారు. తన వద్ద నుంచి పార్కింగ్​ ఫీజు రూ.30 వసూలు చేశారని ఓ వ్యక్తి ట్విట్టర్​లో ఫిర్యాదు చేయగా.. అమీర్​ పేటలోని పావని ప్రెస్టేజీ. కాంప్లెక్స్​ కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.50వేల జరిమానా విధించారు. ఈ నెల 28న అహుజా ఎస్టేట్​ లోని న్యూ సంతోష్​ దాబాలో కొనుగోలు చేసినప్పటికీ పార్కింగ్ ​ఫీజు తీసుకున్నారని మరొక ఫిర్యాదు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ అహుజా ఎస్టేట్​ పైనా రూ.50 వేల జరిమానా విధించింది.

Tags:    

Similar News