RRR టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ అదిరిపోయిందంతే…

దిశ, వెబ్‌డెస్క్: RRR … రౌద్రం రణం రుధిరం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR (Rise Roar Revolt) మూవీ టైటిల్ ఇదే. ఉగాది కానుకగా టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఎట్టకేలకు అప్ డేట్ ఇచ్చింది. మోషన్ పోస్టర్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రౌద్రం… యంగ్ టైగర్ ఎన్టీఆర్ రుధిరం… ఇద్దరూ కలిసి చేసే రణం…. ఆడియన్స్‌కు రోమాలు నిక్కబొడిచేలా చేశాయి. ఎప్పటిలాగే […]

Update: 2020-03-25 02:25 GMT
RRR టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ అదిరిపోయిందంతే…
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: RRR … రౌద్రం రణం రుధిరం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR (Rise Roar Revolt) మూవీ టైటిల్ ఇదే. ఉగాది కానుకగా టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఎట్టకేలకు అప్ డేట్ ఇచ్చింది. మోషన్ పోస్టర్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రౌద్రం… యంగ్ టైగర్ ఎన్టీఆర్ రుధిరం… ఇద్దరూ కలిసి చేసే రణం…. ఆడియన్స్‌కు రోమాలు నిక్కబొడిచేలా చేశాయి. ఎప్పటిలాగే జక్కన్న తన మార్క్‌ను చూపించగా… తారక్, చెర్రీల పవర్ ఫుల్ లుక్ గూస్ బమ్స్ తెప్పించాయి. నీరు, నిప్పుల శక్తి ఏకమైతే విప్లవోద్యమం ఎంత తీవ్రంగా ఉండబోతోందో చూపించబోతున్న జక్కన్న… ‘బాహుబలి’ని మించిన పాన్ ఇండియా మూవీని క్రియేట్ చేస్తున్నాడనడంలో సందేహం లేదు. ప్రస్తుతం.. ఈ సినిమా అప్ డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవగా రికార్డ్స్ ఆల్ రెడీ బ్రేక్ అయ్యాయి. జనవరి 8న విడుదల కానుంది.

1920లో భారతదేశంలో జరిగిన విప్లవాల నేపథ్యంలో కాల్పనికంగా తెరకెక్కుతున్న RRR మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం కనిపిస్తుండగా…. చరణ్ సీతారామ రాజుగా నటిస్తున్నాడు. చెర్రీకి జోడిగా అయాభట్, ఎన్టీఆర్‌కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తుండగా… అజయ్ దేవగన్, సముతిరఖని ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు.

Tags: RRR, Title Logo, Motion Poster, NTR, SSRajamouli, RamCharan Tej

Tags:    

Similar News