మేకప్ ఆర్టిస్ట్‌గా మారిన స్టార్ యాక్టర్.. నా భార్య కోటి రూపాయలకు నన్ను అమ్మేసేముందంటూ షాకింగ్ పోస్ట్

స్టార్ యాక్టర్ జగపతిబాబు(Jagapathi Babu) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.

Update: 2025-03-21 03:17 GMT
మేకప్ ఆర్టిస్ట్‌గా మారిన స్టార్ యాక్టర్.. నా భార్య కోటి రూపాయలకు నన్ను అమ్మేసేముందంటూ షాకింగ్ పోస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాక్టర్ జగపతిబాబు(Jagapathi Babu) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్‌గా నటిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలా ఎన్నో సినిమాల్లో తన ఉగ్ర రూపం చూపించి స్టార్ విలన్ రేంజ్‌కి ఎదిగాడు. చెప్పాలంటే హీరోగా కంటే విలన్‌గానే మంచి గుర్తింపు సంపాదించుకున్నడని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబోలో వస్తున్న‘RC-16’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు జగ్గు భాయ్. ఈక్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా జగపతి బాబు తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు.

అందులో అలనాటి హీరోయిన్‌ ఆమని(Amani)కు మేకప్ ఆర్టిస్ట్‌గా మారి, తనకు టచప్ చేస్తున్నాడు. అలాగే గొడుగు పట్టుకుని తనకు సేవలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ వీడియోకు ‘ కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు’ అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరిద్దరూ కలిసి ‘శుభలగ్నం’(Subhalagnam) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమని కోటి రూపాయలకు హీరోయిన్ రోజా(Roja)కు జగపతి బాబును అమ్మేస్తుంది.

Read More..

టవల్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ.. ఛీ ఛీ ఎంత బరితెగించావు అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు..  


Full View

Tags:    

Similar News