Puri Jagannath: ప్రముఖ దర్శకుడిని అవుట్‌డేటెడ్ అన్న నెటిజన్.. నటుడి మాటలతో పోస్ట్ డిలీట్?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ డైరెక్టర్ ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించి టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా (Vijay Sethupathi) అండ్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రంపై ఓ నెటిజన్ కామెంట్ చేశారు. సినిమాల ఎంపికల విషయంలో.. అవుట్‌డేటెడ్ అయ్యారని అన్నాడు.
మహారాజ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం అనంతరం విజయ్ సేతుపతి పూరీ జగన్నాత్ డైరెక్షన్‌లో నటించడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విమర్శనాత్మకంగా పోస్ట్ చేశాడు. ఈ నెటిజన్ పోస్ట్‌కు నటుడు శాంతను భాగ్యరాజ్ (Shantanu Bhagyaraj) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు కరెక్ట్ వర్డ్స్ యూడ్ చేయండి. స్టార్ దర్శకుడికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. మీ లాంటి వారి నుంచి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేం’ అని అన్నారు. దీంతో ఆ నెటిజన్ సారీ చెప్పి పోస్ట్ రిమూవ్ చేశాడు.